శుక్రవారం 03 జూలై 2020
National - Feb 04, 2020 , 17:23:57

దమ్ముంటే సీఎం అభ్యర్థిని ప్రకటించండి..

 దమ్ముంటే సీఎం అభ్యర్థిని ప్రకటించండి..

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలైన బీజేపీ, ఆప్‌, కాంగ్రెస్‌ హోరాహోరీగా ప్రచారాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ బీజేపీకి సీఎం అభ్యర్థి విషయంలో సవాలు విసిరారు.  దమ్ముంటే సీఎం అభ్యర్థిని ప్రకటించండి. ఢిల్లీ ప్రజలు బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించాలని కోరుకుంటున్నారు. సీఎం ఎవరో ప్రజలు నిర్ణయించాలి కానీ అమిత్‌షానో, మోదీనో కాదని కేజ్రీవాల్‌ అన్నారు.  బీజేపీ బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటలోపు ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు ప్రకటించాలని డెడ్‌లైన్‌ విధించారు. అంతేకాదు బీజేపీ సీఎం అభ్యర్థితో బహిరంగచర్చలకు తాను సిద్దంగా ఉంటానని చెప్పారు. ఒకవేళ బీజేపీ గడవులోగా నిర్ణయం ప్రకటించకపోతే మీడియాముఖంగా తన తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. ఆమ్‌ ఆద్మీపార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన అనంతరం కేజ్రీవాల్‌ మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. 


logo