గురువారం 29 అక్టోబర్ 2020
National - Sep 18, 2020 , 15:27:17

రాజ్య‌స‌భ‌లో ఆ 3 బిల్లుల‌ను వ్య‌తిరేకించండి: కేజ్రివాల్‌

రాజ్య‌స‌భ‌లో ఆ 3 బిల్లుల‌ను వ్య‌తిరేకించండి: కేజ్రివాల్‌

న్యూఢిల్లీ: వ్యవసాయ రంగానికి సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లుల‌పై ఆమ్ ఆద్మీ పార్టీ క‌న్వీన‌ర్‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రివాల్ మ‌రోసారి వ్య‌తిరేకించారు. కేంద్ర ప్ర‌భుత్వం రాజ్య‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టిన వ్య‌వ‌సాయ‌ బిల్లులు రైతుల‌కు న‌ష్టం చేకూర్చేలా ఉన్నాయ‌ని విమ‌ర్శించారు. బీజేపీయేత‌ర పార్టీలు ఆ మూడు బిల్లులను వ్యతిరేకించాలని అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం పిలుపునిచ్చారు.

కేంద్ర ప్ర‌భుత్వం రాజ్య‌స‌భ‌లో పెట్టిన మూడు వ్య‌వ‌సాయ‌ బిల్లులు చ‌ట్టాలుగా మారితే పెద్ద కంపెనీలు ల‌బ్ధి చెందుతాయ‌ని, ఆ కంపెనీల చేతిలో రైతులు మోసపోతారని కేజ్రివాల్ ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. బీజేపీయేతర పార్టీలన్నీ ఏకగ్రీవంగా ఆ బిల్లులను రాజ్యసభలో వ్యతిరేకించాలని కోరారు. ఆ బిల్లుల‌పై ఓటింగ్ కోసం ఎంపీలంతా స‌భ‌కు హాజరుకావాలని సూచించారు. దేశంలోని రైతులంతా మిమ్మల్ని గమనిస్తున్నార‌ని ఎంపీల‌ను ఉద్దేశించి కేజ్రీవాల్ పేర్కొన్నారు. 

కాగా, కేంద్రం పార్ల‌మెంటుకు ముందుకు తెచ్చిన వ్య‌వ‌సాయ బిల్లుల‌ను త‌మ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న‌ద‌ని కేజ్రీవాల్ గురువారం రోజే ప్రకటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo