పాన్ ఇండియా కథాంశంతో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. కొంతకాలం క్రితం పెన్ ఇండియా గ్రూప్ ఆర్ఆర్ఆర్ ఇండియా థ్రియాట్రికల్, శాటిలైట్, డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను భారీ మొత్తానికి దక్కించుకున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. నిర్మాత డీవీవీ దానయ్య, రాజమౌళి ఈ డీల్ తో భారీ మొత్తంలో లాభాలు గడించారు.
ఇపుడు పెన్ ఇండియా రైట్స్ ను డిఫరెంట్ కంపెనీలకు సేల్ చేసిందట. స్ట్రీమింగ్ కంపెనీలు, శాటిలై్ ఛానళ్లకు పెన్ ఇండియా ఇండివిజువల్ రైట్స్ ను అమ్ముకున్నట్టు సమాచారం. ఆర్ఆర్ఆర్ హిందీ, తమిళం, కన్నడం తోపాటు ఇక ఇంగ్లీష్, పోర్చుగీస్, కొరియన్, టర్కిష్, స్పానిష్ భాషల్లో కూడా డబ్ కానుంది. స్టార్ గ్రూప్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం శాటిలైట్స్ రైట్స్ ను తీసుకోగా, జీ హిందీ శాటిలైట్ రైట్స్ ను దక్కించుకుంది.
పెన్ గ్రూప్ ఆర్ఆర్ఆర్ సినిమాను ఇండియాలోని థియేటర్లలో విడుదల చేయనుంది. దక్షిణాది భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను జీ5 దక్కించుకుంది. నెట్ ప్లిక్స్ హిందీ, ఇంగ్లీష్, ఇతర విదేశీ భాషల స్ట్రీమింగ్ రైట్స్ ను హోల్డ్ లో పెట్టినట్టు టాక్.
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
కోవిడ్ ఒత్తిడి నుంచి కోలుకునే రకుల్ యోగాసన్…!
బాలకృష్ణ నుంచి సర్ప్రైజ్ అనౌన్స్ మెంట్?
పవన్-రానా కోసం ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్..?
శ్రీదేవి చిన్న కూతురు టాలీవుడ్ ఎంట్రీ..!
గూని పాత్రలో రావు రమేశ్..ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ లుక్
నటి ఇంట్లో గన్, కత్తితో వ్యక్తి హల్చల్
రాధేశ్యామ్ టీం మరో పాటను షూట్ చేయనుందా..?