బుధవారం 15 జూలై 2020
National - Jun 25, 2020 , 19:17:41

ఎల్‌ఎన్‌జేపీలో వీడియోకాల్‌ సదుపాయం

ఎల్‌ఎన్‌జేపీలో వీడియోకాల్‌ సదుపాయం

న్యూఢిల్లీ : ఢిల్లీలోని లోక్‌ నాయక్‌ జై ప్రకాశ్‌ దవాఖానలో కరోనా బాధితుల కోసం వీడియోకాల్‌ సదుపాయాన్ని గురువారం ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రారంభించారు. వంద రోజుల కిందట కొవిడ్‌-19 దవాఖానగా ప్రకటించిన తొలి దవాఖాన ఎల్‌ఎన్‌జేపీనేనని పేర్కొన్నారు. ఇక్కడ ఎంతో మంది వైరస్‌ నుంచి కోలుకున్నారని తెలిపారు. ఇది రెండువేల పడకలు కలిగిన పెద్ద దవాఖాన అనీ, ప్లాస్మా థెరపీ ప్రారంభించిన మొదటి దవాఖాన కూడా ఇదేనన్నారు. కరోనా పాజిటివ్‌ గర్భిణులకు నార్మల్‌, సిజేరియర్‌ ప్రసవాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 114 ప్రసవాలు హాస్పిటల్‌లో జరిగాయని చెప్పారు. వైరస్‌తో ఇక్కడ చేరిన బాధితులు కుటుంబం, స్నేహితులతో మాట్లాడుకునేందుకు వీలుగా వీడియో కాల్ సదుపాయం కల్పించినట్లు చెప్పారు. కాగా, గురువారం నాటికి ఢిల్లీలో 70,390 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఇందులో 26,588 మంది చికిత్స పొందుతుండగా, 41,437 మంది డిశ్చార్జి అయ్యారు.


logo