శనివారం 29 ఫిబ్రవరి 2020
ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వానికి మోదీని ఆహ్వానించిన కేజ్రీవాల్‌

ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వానికి మోదీని ఆహ్వానించిన కేజ్రీవాల్‌

Feb 14, 2020 , 19:07:03
PRINT
ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వానికి మోదీని ఆహ్వానించిన కేజ్రీవాల్‌

హైద‌రాబాద్‌:  ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ఆదివారం ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. రామ్‌లీలా మైదానంలో ఆయ‌న ఉద‌యం 10 గంట‌ల‌కు ప్ర‌మాణ స్వీకారం చేస్తారు. ఆ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని మోదీని ఆయ‌న ఆహ్వానించారు. గురువారం రోజున ఇన్విటేష‌న్ పంపిన‌ట్లు ఆప్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. వ‌రుస‌గా మూడ‌వ‌సారి కేజ్రీవాల్.. ఢిల్లీ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. ఈనెల 8వ తేదీన జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 62 సీట్ల‌తో గెలుపొందిన విష‌యం తెలిసిందే.  ఢిల్లీ ప్ర‌జ‌లు త‌న‌పై విశ్వాసాన్ని ఉంచిన‌ట్లు కేజ్రీ చెప్పారు.  

logo