ఆదివారం 05 జూలై 2020
National - Jun 29, 2020 , 14:37:51

వైద్యుడి కుటుంబానికి రూ.కోటి : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌

వైద్యుడి కుటుంబానికి రూ.కోటి : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌తో ప్రాణాలు కోల్పోయిన వైద్యుడు అషీమ్‌గుప్తా కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.కోటి గౌరవ వేతనం చెల్లించనున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సోమవారం ప్రకటించారు. లోక్‌ నాయక్‌ జయప్రకాశ్‌ దవాఖానలో సీనియర్‌ డాక్టర్‌గా సేవలందిస్తున్న అషీమ్‌గుప్తా కరోనా వైరస్‌ బారినపడి ఆదివారం సాకేత్‌లోని మ్యాక్స్‌ దవాఖానలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ ఆయన సేవలను కొనియాడారు. కొవిడ్‌-19 పోరాటంలో మేము విలువైన ఫైటర్‌ను కోల్పోయామన్నారు. తనకు త్యాగానికి సెల్యూట్ చేస్తున్నానన్నారు. ఆయన భార్యకు సంతాపం తెలిపి, ప్రభుత్వం తరఫున మద్దతు ఇచ్చినట్లు ట్వీట్‌ చేశారు. అలాగే విలేకరుల సమావేశంలోనూ డాక్టర్‌ గుప్తాకు నివాళులర్పించారు. జూన్‌ ౩న ఎల్‌ఎన్‌జేపీలో విధుల్లో చేరారని తెలిపారు. డాక్టర్‌ అయిన అతని భార్య కూడా వైరస్‌ బారినపడి కోలుకున్నారని తెలిపారు. ప్రభుత్వం అతని కుటుంబానికి రూ.కోటి గౌరవంగా ఇస్తున్నామని, అతని జీవితానికి ఎప్పుడూ వెలకట్టలేమన్నారు.


logo