శనివారం 31 అక్టోబర్ 2020
National - Aug 20, 2020 , 21:27:57

పాముకు క‌ప్ప‌కు గిట్ట‌ద‌ని ఎవ‌రు చెప్పారు.. వీడియో చూస్తే ఆ మాట అన‌రు!

పాముకు క‌ప్ప‌కు గిట్ట‌ద‌ని ఎవ‌రు చెప్పారు.. వీడియో చూస్తే ఆ మాట అన‌రు!

పాముని చూస్తే క‌ప్పకు గుండె ఆగినంత ప‌న‌వుతుంది. ఎక్క‌డ ల‌టుక్కున లాగేసుకొని తినేస్తుందో అని నిత్యం భ‌య‌ప‌డుతూ చ‌స్తుంది. కానీ పాముకు మాత్రం క‌ప్ప క‌నిపిస్తే భ‌లే ఆనందం. ఎందుకంటే త‌న ఆక‌లి తీరుస్తుంది కాబ‌ట్టి. ఉప్పు, నిప్పులా ఉండే ఈ రెండూ క‌లిసుంటాయ‌ని ఏనాడైనా అనుకున్నారా? ఇప్ప‌టి నుంచి అనుకోవాలి. అన్నిరోజులు ఒకేలా ఉండ‌వు క‌దా.

మ‌నుషులు మారేకొద్దీ వ‌న్య‌ప్రాణుల్లో కూడా మార్పు వ‌స్తుంది. ఇదుగో ఈ వీడియోనే నిద‌ర్శ‌నం. భ‌య‌ప‌డ‌కుండా పాము మీద కూర్చొని కప్ప రైడ్ చేస్తున్న‌ది. ఈ వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ ట్విట‌ర్‌లో షేర్ చేశారు. 'మీ శత్రువుతో సన్నిహితంగా ఉండటం మనుగడ సాంకేతికత'‌ అనే శీర్షిక‌ను జోడించారు నందా. దారిలా క‌నిపించే తెల్ల‌ని పాము మీద‌ హాయిగా ప్ర‌యాణిస్తుంది క‌ప్ప‌. వీడియో ఆన్‌లైన్‌లోకి వ‌చ్చిన కాసేప‌టికే వైర‌ల్ అయింది.