ఆదివారం 29 నవంబర్ 2020
National - Nov 17, 2020 , 03:13:59

కేదార్‌నాథ్‌, యమునోత్రి మూసివేత

కేదార్‌నాథ్‌, యమునోత్రి మూసివేత

  • భారీ హిమపాతమే కారణం..

డెహ్రాడూన్‌/శ్రీనగర్‌: చలికాలం, భారీ హిమపాతం నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌, యమునోత్రి ఆలయాలను మూసివేశారు. సోమవారం పూజలు నిర్వహించిన అనంతరం రెండు ఆలయాల గేట్లకు తాళాలు వేశారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఉత్తరాఖండ్‌ సీఎం త్రివేంద్రసింగ్‌ రావత్‌ పాల్గొన్నారు. కేదార్‌నాథ్‌ ఆలయాన్ని సోమవారం ఉదయం 8.30 గంటలకు మూసివేశారు. కేదార్‌నాథ్‌లో మంచువల్ల హెలికాప్టర్‌ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఇద్దరు సీఎంలు కొన్ని గంటలపాటు ఆలయంలోనే ఉండాల్సి వచ్చింది. యమునోత్రిని మధ్యాహ్నం 12.15 గంటలకు మూసివేశారు. ఛార్‌ధామ్‌లో భాగమైన గంగోత్రిలో ఆదివారం నుంచే దర్శనాలు నిలిపివేశారు. ఇదిలా ఉండగా, భారీ హిమపాతం కారణంగా జమ్ముకశ్మీర్‌, ఉత్తరాఖండ్‌లోని ఎత్తైన ప్రాంతాలు మంచుతో నిండిపోయాయి. జమ్ము-శ్రీనగర్‌ జాతీయ రహదారిపై పెద్దఎత్తున మంచు పేరుకుపోవడంతో ఆ దారిని మూసివేశారు.