బుధవారం 30 సెప్టెంబర్ 2020
National - Sep 16, 2020 , 10:06:43

వీఐపీల‌పై చైనా నిఘా.. ఏం చ‌ర్య‌లు తీసుకున్నారు ?

వీఐపీల‌పై చైనా నిఘా.. ఏం చ‌ర్య‌లు తీసుకున్నారు ?

హైద‌రాబాద్‌: చైనాలోని షెంజెన్‌కు చెందిన ఓ డేటా కంపెనీ.. భార‌తీయ వీఐపీల డేటాను ట్రాక్ చేస్తున్న‌ట్లు మీడియాలో వ‌స్తున్న వార్త‌ల గురించి కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఇవాళ రాజ్య‌స‌భ‌లో ప్ర‌శ్నించారు.  సుమారు ప‌ది వేల మంది భార‌తీయులపై ఆ కంపెనీ నిఘా పెట్టిన‌ట్లు ఆరోపించారు. అయితే ఈ విష‌యం గురించి కేంద్ర ప్ర‌భుత్వం ఎటువంటి స‌మాచారం సేక‌రించింద‌ని వేణుగోపాల్ అడిగారు.  ఇప్ప‌టి వ‌ర‌కు ఈ అంశానికి సంబంధించిన ఏవైనా చ‌ర్య‌లు చేప‌ట్టారా అని ఆయ‌న ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు.  

రాజ్య‌స‌భ‌లో జీరో అవ‌ర్ స‌మ‌యంలో మ‌రో కాంగ్రెస్ ఎంపీ దిగ్విజ‌య్ సింగ్‌.. మెడిక‌ల్ ఆక్సిజ‌న్ ధ‌ర‌ల‌పై కామెంట్ చేశారు. కోవిడ్ మ‌హ‌మ్మారి వేళ ఆక్సిజ‌న్ ధ‌ర‌లు పెరిగిన‌ట్లు ఆయ‌న ఆరోపించారు.  అనేక ప్రాంతాల్లో ఆక్సిజ‌న్ కొర‌త ఉన్న‌ట్లు చెప్పారు. ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల ధ‌ర అంత‌టా ఒకేర‌కంగా ఉండాల‌ని, దేశ‌మంతా కూడా స‌ర‌ఫ‌రా జ‌ర‌గాల‌ని బీజేపీ ఎంపీ డాక్ట‌ర్ భ‌గ‌వ‌త్ క‌రాడ్ తెలిపారు. గోధుమ రైతుల‌కు మ‌ద్ద‌తు ధ‌ర‌ను త‌క్కువ‌గా ఇస్తున్న‌ట్లు స‌మాజ్‌వాదీ పార్టీ ఎంపీ జావెద్ అలీ ఖాన్ తెలిపారు. యూపీలో త‌న స్వంత పంట‌ను అమ్మేందుకు వెళ్లిన‌ప్పుడు కూడా త‌న‌కు స‌మ‌స్య‌లు ఎదురైన‌ట్లు ఆయ‌న చెప్పారు.  logo