శుక్రవారం 15 జనవరి 2021
National - Jan 14, 2021 , 16:49:49

కౌన్‌బ‌నేగా క‌రోడ్‌ప‌తిగా కిర‌ణ్ బాజ్‌పాయి?

కౌన్‌బ‌నేగా క‌రోడ్‌ప‌తిగా కిర‌ణ్ బాజ్‌పాయి?

న్యూఢిల్లీ: బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ హోస్ట్‌గా నిర్వ‌హిస్తున్న కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి? టీవీ కార్య‌క్ర‌మంలో గుజ‌రాత్‌కు చెందిన మ‌హిళ కిర‌ణ్ బాజ్‌పేయి క‌రోడ్‌ప‌తి కానున్నారు. ఈ ఏడాది క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి-12 సీజ‌న్ కార్య‌క్ర‌మం షూటింగ్ ఇటీవ‌లే ముగిసింది. క‌రోనా క‌ష్ట‌కాలంలో షూటింగ్‌లో పాల్గొన్న సిబ్బందికి బిగ్ బీ ధ‌న్య‌వాదాలు తెలిపారు.

తాను సైతం క‌రోనా మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డ బిగ్ బీ.. కోలుకున్న త‌ర్వాత ఆగ‌స్టులో ఈ కార్య‌క్ర‌మం షూటింగ్‌లో పాల్గొన్నారు. ఆయ‌న కొడుకు అభిషేక్ బ‌చ్చ‌న్‌, కోడ‌లు ఐశ్వ‌ర్య‌రాయ్ బ‌చ్చ‌న్‌, మ‌నుమ‌రాలు ఆరాధ్య బ‌చ్చ‌న్‌లు క‌రోనాతో ముంబైలోని నానావతి ద‌వాఖాన‌లో చికిత్స పొందిన సంగ‌తి త‌లిసిందే. 

ప్ర‌స్తుతం కిర‌ణ్ బాజ్‌పేయికి బిగ్ బీ వేసిన కోటి రూపాయ‌ల ప్ర‌శ్న ప్రోమో ప్ర‌స్తుతం సోనీ టీవీలో ప్ర‌సార‌మ‌వుతున్న‌ది. కిర‌ణ్ బాజ్‌పేయితో కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి న‌గ‌దు అవార్డు గెలుచుకున్న మ‌హిళ‌ల సంఖ్య ఐదుగురికి చేరుకున్న‌ది.

ఇంతకుముందు డాక్ట‌ర్ నీరా షా, టీచ‌ర్ అనుప‌మ దాస్‌, క‌మ్యూనికేష‌న్స్ మేనేజ‌ర్ నాజియా న‌సీం, ఐపీఎస్ ఆఫీస‌ర్ మోహితా శ‌ర్మ ఉన్నారు. ఈ సీజ‌న్ కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తిలో మ‌రో ఆస‌క్తికర అంశం కూడా ఉంది. బిగ్ బీ కోసం ఈ ద‌ఫా కిర‌ణ్ బాజ్‌పేయి రాఖీ కూడా తెచ్చారు. అమితాబ్ స్పందిస్తూ ఆమెను త‌న సోద‌రిగా అంగీక‌రించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.