గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 13:05:59

క‌రోనా భ‌యంతో ఆస్ప‌త్రికి కాంగ్రెస్ ఎమ్మెల్యే!

క‌రోనా భ‌యంతో ఆస్ప‌త్రికి కాంగ్రెస్ ఎమ్మెల్యే!

జైపూర్‌: క‌రోనా మ‌హమ్మారికి సామాన్యులు, వీఐపీలు అన్న భేదాలు లేవు. ఉన్నోడు లేనోడు అన్న తేడా చూడదు. దీంతో జ్వ‌రం, గొంతునొప్పి లాంటి ల‌క్ష‌ణాలు క‌నిపించాయంటే జ‌నం భ‌యంతో ఆస్ప‌త్రుల‌కు ప‌రుగులు తీస్తున్నారు. తాజాగా రాజ‌స్థాన్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే బాబూలాల్ బైర్వాకు శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది, జ‌లుబు, జ్వ‌రం లాంటి క‌రోనా సంబంధ ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో జైపూర్‌లోని స‌వాయ్ మాన్‌సింగ్ ఆస్ప‌త్రిలో చేరారు. క‌రోనా సోకిందేమోన‌న్న అనుమానంతో ప‌రీక్ష‌లు చేయించుకుని చికిత్స తీసుకుంటున్నారు.

ఎమ్మెల్యే బాబూలాల్ బైర్వా రాజ‌స్థాన్‌లోని క‌థుమార్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఇటీవ‌ల ఉప‌ముఖ్య‌మంత్రి స‌చిన్ పైల‌ట్ ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్ ప్ర‌భుత్వంపై తిరుగుబాటు చేయ‌డంతో రాజ‌స్థాన్‌లో రాజ‌కీయ సంక్షోభం త‌లెత్తింది. దాంతో గెహ్లాట్ వ‌ర్గంలో ఉన్న ఎమ్మెల్యే బాబూలాల్ బైర్వా గ‌త రెండు వారాలుగా ఇత‌ర ఎమ్మెల్యేల‌తో క‌లిసి ఫెయిర్‌మంట్ హోట‌ల్‌లో బ‌స చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో ఆస్ప‌త్రిలో చేరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo