సోమవారం 30 మార్చి 2020
National - Mar 27, 2020 , 14:59:43

క‌రోనా ఎఫెక్ట్‌: బ‌య‌ట‌కు వ‌స్తే నుదిటిపై ముద్ర

క‌రోనా ఎఫెక్ట్‌: బ‌య‌ట‌కు వ‌స్తే నుదిటిపై ముద్ర

శ్రీన‌గ‌ర్‌: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమ‌ల్లో ఉన్న‌ప్ప‌టికీ ఏ మాత్రం లెక్క‌చేయ‌కుండా రోడ్ల‌పై తిరుగుతున్న వారిప‌ట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. కొన్నిచోట్ల లాఠీలు విరిగేదాక కొడుతున్నారు. మ‌రికొన్ని చోట్ల గుంజీలు తీయిస్తున్నారు. ఇంకొంద‌రు క‌ప్ప‌గంతులు వేయిస్తున్నారు. మ‌రికొంద‌రైతే మీకు దండం పెడుతాం రోడ్ల మీదకు రాకండి ఆంటూ చేతులెక్కి మొక్కుతున్నారు. ఏ రాష్ట్ర పోలీసులు ఎలా వ్య‌వ‌హ‌రించినా జ‌నం రోడ్ల‌పైకి రావ‌డం మాత్రం మానుకోవ‌డం లేదు.  

ఈ నేప‌థ్యంలో జ‌మ్ముక‌శ్మీర్లోని రణ్‌బీర్‌ సింగ్ పురా పోలీసులు మాత్రం లాక్‌డౌన్‌ ఉల్లంఘ‌నులను వినూత్న రీతిలో శిక్షిస్తున్నారు. రోడ్ల మీద‌కు వ‌స్తే వారి నుదుర్ల‌పై స్టాంపులు వేస్తున్నారు. కొంద‌రికి చేతుల‌పై స్టాంపులు వేస్తున్నారు. ఆ స్టాంపుల‌పై వీరు లాక్‌డౌన్ ఉల్లంఘ‌నులు అని రాసి ఉండ‌టంతోపాటు సంబంధిత పోలీస్ స్టేష‌న్ పేరు కూడా ఉంది. ఈ స్టాంపులు 15 రోజులపాటు చెడిపోకుండా ఉంటాయట‌.


logo