శనివారం 23 జనవరి 2021
National - Jan 12, 2021 , 13:32:13

కొవిడ్‌ వారియర్స్‌కు ‘చల్లటి’ నివాళి

కొవిడ్‌ వారియర్స్‌కు ‘చల్లటి’ నివాళి

శ్రీనగర్‌ : జమ్ముకశ్మీర్‌లో గత కొంతకాలంగా భారీగా మంచు కురుస్తున్నది. ఇండ్ల నుంచి ప్రజలు బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాన రోడ్లను ముందు జాగ్రత్త చర్యగా మూసివేశారు. ఈ నేపథ్యంలో కశ్మీర్‌కు చెందిన అక్కాచెల్లెలు కరోనా వారియర్స్‌కు నివాళి అర్పించడానికి హిమపాతాన్ని ఎంచుకుని శహబాష్‌ అనిపించుకున్నారు. వీరిలో ఒకరు వైద్యురాలు డాక్టర్‌ కుర్తుల్‌ జోహ్రా కాగా, మరొకరు న్యాయవాది ఎమోన్‌ జోహ్రా. చిన్ననాటి నుంచి మంచులో పెరిగిన వీరికి మంచుగడ్డలతో బొమ్మలు తయారుచేయడం అలవడింది. దీన్నే హాబీగా మలుచుకుని వివిధ మంచు శిల్పాలను తయారు చేసి ప్రదర్శించేవారు. 

వీరి అందమైన మంచు కళలో లేడీ డాక్టర్, కొవిడ్ వ్యాక్సిన్ ఉన్న సిరంజి కనిపిస్తుంది. ఇవే కాకుండా స్టెతస్కోప్, ప్రపంచ ఆరోగ్య సంస్థ అబ్రివేషన్‌ రాశారు. ఈ శిల్పంతో కరోనాకు వ్యతిరేకంగా యుద్ధం చేసిన యోధులకు డాక్టర్ కుర్తుల్ ఎన్ జోహ్రా కృతజ్ఞతలు తెలిపారు. ఈ మహిళలు తమ శిల్పాల ద్వారా మహిళా సాధికారత సందేశాన్ని కూడా ఇస్తున్నారు. అంటువ్యాధిలో వైద్యులు, పోలీసులు, అంబులెన్స్ డ్రైవర్లు, మీడియా ప్రత్యేక పాత్ర పోషించారని వారన్నారు. లేడీ డాక్టర్ శిల్పకళను సృష్టించడం ద్వారా.. అంటువ్యాధి మధ్య రాత్రింబవళ్ళు ప్రజలకు సేవ చేస్తున్న మహిళలకు నివాళి అర్పించాలని కోరుకుంటున్నట్లు జోహ్రా చెప్పారు. కళ తమ రక్తంలోనే ఉన్నదని.. పాఠశాల రోజుల్లో ఎన్నో కళా పోటీల్లో పాల్గొని గెలిచామని వారు తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. 

ఇవి కూడా చదవండి..

48 వ రోజుకు చేరిన రైతు ఉద్యమం

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo