గురువారం 09 జూలై 2020
National - Jun 23, 2020 , 17:14:15

ఉగ్ర‌వాదంలో చేరిన పీ హెచ్ డీ స్కాల‌ర్

ఉగ్ర‌వాదంలో చేరిన పీ హెచ్ డీ స్కాల‌ర్

శ్రీన‌గ‌ర్ : జ‌మ్మూక‌శ్మీర్ కు చెందిన ఓ పీ హెచ్ డీ స్కాల‌ర్.. ఉగ్ర‌వాద సంస్థ‌లో చేరాడు. ఈ విష‌యాన్ని జ‌మ్మూక‌శ్మీర్ పోలీసులు ధృవీక‌రించారు. శ్రీన‌గ‌ర్ జిల్లాలోని బీమినా ఏరియాకు చెందిన హిలాల్ అహ్మ‌ద్.. పీ హెచ్ డీ చేస్తున్నాడు. జూన్ 14న త‌న మిత్రుల‌తో క‌లిసి నార్నాంగ్ ఏరియాలో ట్రెక్కింగ్ కోసం వెళ్లాడు. మిగ‌తా మిత్రులంతా గంగాబాల్ లేక్ వ‌ద్ద‌కు కాలిన‌డ‌క‌న వెళ్తున్న క్ర‌మంలో.. హిలాల్ మాత్రం నార్నాంగ్ లోనే ఉండిపోయాడు. ఈ స‌మ‌యంలోనే అత‌ను ఉగ్ర‌వాదుల‌తో చేతులు క‌లిపాడు. మిత్రులంతా నార్నాంగ్ తిరిగొచ్చే స‌రికి.. అక్క‌డ హిలాల్ లేడు. అత‌ని కుటుంబ స‌భ్యులు త‌మ కుమారుడు అదృశ్య‌మ‌య్యాడ‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. ద‌ర్యాప్తు చేప‌ట్ట‌గా అత‌ను ఉగ్ర‌వాద సంస్థ‌లో చేరిన‌ట్లు నిర్ధార‌ణ అయింది. 

ఈ ఏడాదిలో ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 49 మంది యువ‌కులు.. ప‌లు ఉగ్ర‌వాద సంస్థ‌ల్లో చేరిన‌ట్లు ఆర్మీ అధికారులు గ‌త వారం వెల్ల‌డించారు. వీరిలో 27 మందిని ఇప్ప‌టికే ఎన్ కౌంట‌ర్ చేసిన‌ట్లు అధికారులు స్ప‌ష్టం చేశారు. క‌శ్మీర్ వ్యాలీలో ఉగ్ర‌వాద చ‌ర్య‌ల‌ను క‌ట్ట‌డి చేస్తున్న‌ట్లు పోలీసులు స్ప‌ష్టం చేశారు. 


logo