మంగళవారం 07 జూలై 2020
National - Jun 24, 2020 , 09:41:32

త్వరలోనే కశ్మీర్‌లో తొలి మల్టీప్లెక్స్‌ సినిమా థియేటర్‌ ప్రారంభం

త్వరలోనే కశ్మీర్‌లో తొలి మల్టీప్లెక్స్‌ సినిమా థియేటర్‌ ప్రారంభం

శ్రీనగర్‌ : కశ్మీర్‌లో తొలి మల్టీప్లెక్స్‌ సినిమా థియేటర్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. కశ్మీర్‌ ప్రజలు దాదాపు మూడు దశాబ్దాల తర్వాత సిల్వర్‌ స్క్రీన్‌పై బాలీవుడ్‌ ఫిల్మ్స్‌ను చూడనున్నారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న మూడంతస్థుల మల్టీప్లెక్స్‌ సినిమా థియేటర్‌ మార్చి 2021న ప్రారంభం కానుంది. ఉగ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో 1990 నుంచి కశ్మీర్‌లో థియేటర్లు దాదాపుగా మూతబడ్డాయి. 

ప్రస్తుతం కశ్మీర్‌ లోయలో ఉగ్రవాదుల కదలికలు దాదాపుగా నిర్వీర్యం అయ్యాయి. పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకున్నాయి. సినిమాలు ప్రదర్శించేందుకు భవనానికి ఇప్పటికే అనుమతులు అందాయి. భవన నిర్మాణం పూర్తి అనంతరం లైసెన్స్‌ మంజూరు కానుంది. మల్టీప్లెక్స్‌ మూడు సినిమా థియేటర్లను కలిగిఉంది. తస్కల్‌ హాస్పిటాలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మల్టీప్లెక్స్‌ నిర్మాణాన్ని చేపట్టింది. ఇది ధార్‌ కుటుంబానికి చెందినది. ధార్‌ కుటుంబం శ్రీనగర్‌లో ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ శాఖలను నడుపుతోంది. 


logo