బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 22:10:17

కాశ్మీర్‌ కుంకుమ పువ్వుకు జీఐ సర్టిఫికేషన్‌

కాశ్మీర్‌ కుంకుమ పువ్వుకు జీఐ సర్టిఫికేషన్‌

జమూ : కాశ్మీర్ లోయలో సాగయ్యే కుంకుమ పువ్వుకు కేంద్ర ప్రభుత్వం శనివారం జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ (జీఐ) సర్టిఫికేషన్‌ జారీ చేసింది. ప్రామాణికతతో గ్లోబల్ మ్యాప్‌ లోయ బ్రాండ్‌ను తీసుకురావడంలో ఓ చారిత్రాత్మక ముందడుగుగా లెఫ్టినెంట్ గవర్నర్ గిరీష్‌ చంద్ర ముర్ము అభివర్ణించారు. కేంద్రం నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. జీఐ ట్యాగ్‌తో కాశ్మీర్‌ కుంకుమ పువ్వు ఎగుమతి మార్కెట్లో మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంటుందని, రైతులకు అత్యుత్తమ గిట్టుబాటు ధర పొందడానికి సహాయపడుతుందని ముర్ము పేర్కొన్నారు. స్వదేశీ కాశ్మీరి మలాసా కోసం జీఐ ట్యాగ్‌ కోసం ప్రయత్నం చేసిన జేకే వ్యవసాయ డైరెక్టర్‌ అల్తాఫ్‌ ఐజాజ్‌ ఆంద్రాబీని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అభినందించారు. 

కాశ్మీర్‌ వైభవాన్ని పునరుద్ధరించడం కేంద్రం పాలిత ప్రాంతం (యూటీ) పరిపాలనకు, కేంద్రం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని పేర్కొన్నారు. నేషనల్ సాఫ్రాన్‌ మిషన్ (ఎన్ఎస్ఎం) కింద దక్షిణ కాశ్మీర్‌లోని పాంపోర్ వద్ద ఆగస్టులో అత్యాధునిక స్పైస్ పార్కును ప్రారంభించడంతో పరిశ్రమ దిశను మార్చుతుందని ఆయన పేర్కొన్నారు. జీఐ సర్టిఫికేషన్ నిర్ధిష్ట భౌగోళిక ఆవిర్భావాన్ని ఏర్పాటు చేసి, ఉత్పత్తి నిర్ధిష్ట ప్రత్యేక లక్షణాలను ధ్రువీకరిస్తుందని వ్యవసాయ ఉత్పత్తి విభాగం జేకే ప్రిన్సిపాల్‌ సెక్రెటరీ నవీన్‌ కే చౌదరి పేర్కొన్నారు. కుంకుమ పువ్వు మరింత మెరుగైన ధర వస్తుందని తెలిపారు. ఎల్‌జీ సూచనల మేరకు స్ప్రింక్లర్ ఇరిగేషన్ సిస్టమ్‌ను కాశ్మీర్‌ పొలాల్లో ఏర్పాటు చేస్తున్న ట్లు చౌదరి వివరించారు. రాబోయే రెండు నెలల్లో ఈ ఇన్ స్టలేషన్ పూర్తి కాగలదని ఆయన పేర్కొన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo