ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 22:00:58

కర్ణాటకలో కరోనా పరిస్థితిపై గవర్నర్‌తో సీఎం చర్చ

కర్ణాటకలో కరోనా పరిస్థితిపై గవర్నర్‌తో సీఎం చర్చ

బెంగళూర్‌ : కర్ణాటకలో కరోనా పరిస్థితిపై ఆ రాష్ట్ర సీఎం బీఎస్‌ యడ్యూరప్పతోపాటు హోంమంత్రి బసవరాజ్‌ బొమ్మాయ్‌ ఆ రాష్ట్ర గవర్నర్‌  వాజూభాయ్‌ వాలాతో చర్చించారు. శుక్రవారం సాయంత్రం రాజ్‌భవన్‌కు వచ్చిన వారు గవర్నర్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయనకు వివరించారు. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ,  ఆంధ్రప్రదేశ్‌ తరువాత కర్ణాటకలోనే అత్యధిక కరోనా కేసులున్నట్లు గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటివరకు కర్ణాటక రాష్ట్రంలో 1,18,632 కరోనా కేసులు నమోదు కాగా 46,694 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 69,708 మంది దవాఖానల్లో చికిత్స పొందుతుండగా వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా 2230 మంది మృతి చెందారని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 


logo