సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 20:26:31

పిల్ల‌ల చ‌దువు కోసం.. మంగ‌ళ‌సూత్రం త‌న‌ఖాపెట్టి టీవీ కొన్న మ‌హిళ‌

పిల్ల‌ల చ‌దువు కోసం.. మంగ‌ళ‌సూత్రం త‌న‌ఖాపెట్టి టీవీ కొన్న మ‌హిళ‌

బెంగ‌ళూరు: క‌ర్ణాట‌క‌కు చెందిన ఒక మ‌హిళ త‌న పిల్ల‌ల చ‌దువు కోసం ఏకంగా మంగళ‌సూత్రాన్ని త‌‌న‌ఖాపెట్టి టీవీ కొన్నారు. ఆగ‌స్టు నెల స‌మీపించినా క‌రోనా నేప‌థ్యంలో స్కూళ్లు తెరువ‌ని ప‌రిస్థితి నెల‌కొన్న‌ది. ఈ నేప‌థ్యంలో ద్రుశ్య‌శ్ర‌వ‌ణ మాధ్యంలో త‌ర‌గ‌తులు నిర్వ‌హించాల‌ని క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దీంతో గ‌డ‌గ్‌కు చెందిన క‌స్తూరి అనే మ‌హిళ త‌న పిల్ల‌ల చ‌దువు కోసం మంగ‌ళ‌సూత్రాన్ని త‌న‌ఖాపెట్టి టీవీ కొనుగోలు చేశారు. ఆన్‌లైన్ త‌ర‌గ‌తుల కోసం టీవీ కొన‌మ‌ని టీచ‌ర్లు చెప్పార‌ని, త‌మ వ‌ద్ద డ‌బ్బు లేక‌పోవ‌డంతో మంగ‌ళ‌సూత్రాన్ని తాక‌ట్టు పెట్టి కొన్న‌ట్లు ఆమె తెలిపారు. క‌రోనా నేప‌థ్యంలో పిల్ల‌ల‌ను రోజూ పొరుగువారి ఇంటికి పంపించలేని ప‌రిస్థితిలో ఇలా చేయాల్సి వ‌చ్చింద‌న్నారు.
logo