e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home News Karnataka CM | కర్ణాటక సీఎం మార్పు ఖాయమా ? యెడ్డీ వారసుడెవరు.. బొమ్మైకి చాన్సిస్తారా?

Karnataka CM | కర్ణాటక సీఎం మార్పు ఖాయమా ? యెడ్డీ వారసుడెవరు.. బొమ్మైకి చాన్సిస్తారా?

బెంగ‌ళూరు: క‌ర్ణాట‌క సీఎంగా బీఎస్ యెడియూర‌ప్ప వైదొల‌గ‌డం ఖాయంగా క‌నిపిస్తున్న‌ది. ఈ మేర‌కు యెడియూర‌ప్ప శ‌నివారం త‌న నిష్క్మ‌ణ‌పై సంకేతాలిచ్చారు. తాను సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ప్ప‌టి నుంచి ప‌లు స‌వాళ్ల‌ను ఎదుర్కొన్న‌ట్లు చెప్పారు. కానీ, రాష్ట్ర జీవ‌న స్థితిగ‌తుల‌ను మెరుగు ప‌రిచేందుకు నిజాయితీగా ప‌ని చేశాన‌న్నారు.

26 వ‌ర‌కే సీఎంగా యెడియూర‌ప్ప‌?

సోమ‌వారం త‌న‌కు సీఎంగా చివ‌రి రోజ‌ని యెడియూర‌ప్ప సంకేతాలిచ్చారు. బీజేపీ కేంద్ర నాయ‌క‌త్వం సూచ‌న‌ల మేర‌కు ఈ నెల 25 (ఆదివారం) వ‌ర‌కు సీఎంగా యెడియూర‌ప్ప కొన‌సాగుతాన‌ని అన్నారు. 26 నుంచి త‌న సొంత ప‌నులు చేసుకుంటాన‌ని చెప్పారు. త‌న ప్ర‌భుత్వం కొలువుదీరి జూలై 26వ తేదీ నాటికి రెండేండ్లు పూర్తి చేసుకుంటుంద‌న్నారు.

2023 ఎన్నిక‌లే ల‌క్ష్యంగా సీఎం ఎంపిక‌

- Advertisement -

78 ఏండ్ల లింగాయ‌త్ స్ట్రాంగ్ మ్యాన్‌కు స‌రిప‌డే నేత కోసం బీజేపీ కేంద్ర నాయ‌క‌త్వం క‌స‌ర‌త్తు చేప‌ట్టిన‌ట్లు తెలుస్తున్న‌ది. బీజేపీ వ‌ర్గాల క‌థ‌నం ప్ర‌కారం 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ధీటుగా ఎదుర్కొనే నేత ఎంపిక కోసం ప్ర‌య‌త్నిస్తున్న‌ది.

యెడ్డి వార‌సుడిగా మ‌ళ్లీ లింగాయ‌త్‌?

యెడియూర‌ప్ప వార‌స‌త్వాన్ని ముందుకు తీసుకెళ్ల‌డానికి ఆయ‌న వారసుడిగా, క‌ర్ణాట‌క త‌దుప‌రి సీఎంగా లింగాయ‌త్‌నే బీజేపీ కేంద్ర నాయ‌క‌త్వం ఎంపిక చేసే అవ‌కాశాలు లేక‌పోలేదు. సీఎం ప‌ద‌వికి అర్హులైన‌, ఆశిస్తున్న వారి పేర్ల‌ను షార్ట్ లిస్ట్ చేసిన‌ట్లు స‌మాచారం.

క‌మ‌ల‌నాథుల వ‌ద్ద షార్ట్ లిస్ట్ ఇలా

ఎనిమిది మంది నేత‌ల పేర్ల‌ను, పూర్వాప‌రాల‌ను బీజేపీ కేంద్ర నాయ‌క‌త్వం ప‌రిశీలిస్తున్న‌ట్లు వినికిడి. ధార్వాడ్ వెస్ట్ ఎమ్మెల్యే అర‌వింద్ బెల్లాద్‌, విజ‌య‌పుర శాస‌న‌స‌భ్యుడు బ‌స‌న్న‌గౌడ పాటిల్ య‌త్నాల్‌, రాష్ట్ర మంత్రులు మురుగేశ్ ఆర్ నిరాణీ, బ‌స్వ‌రాజ్ బొమ్మై పేర్లు బీజేపీ అధిష్ఠానం ప‌రిశీల‌న‌లో ఉన్నాయి.

బ‌స్వ‌రాజ్ బొమ్మైకి యెడ్డీ ఆశీస్సులు

బీజేపీ నాయ‌క‌త్వానికి త‌న వార‌సుడిగా.. రాష్ట్ర హోంమంత్రి బ‌స్వ‌రాజ్ బొమ్మై పేరును సిఫార‌సు చేసిన‌ట్లు విశ్వ‌స‌నీయంగా తెలిసింది. ఆయ‌న‌తోపాటు ప్ర‌హ్లాద్ జోషి, బీఎల్ సంతోష్‌, సీఎన్ అశ్వ‌థ్ నారాయ‌ణ్‌, ల‌క్ష్మ‌ణ్ స‌వాదీ, గోవింద్ క‌ర్జోల్‌, విశ్వేశ్వ‌ర హెగ్డే క‌గేరీ, సీటీ ర‌వి పేర్లు కూడా చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి.

శివ‌మొగా జిల్లా సొంత శిఖారిపురా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లకు సేవ‌లు అందించేందుకు వెళుతున్నందుకు గ‌ర్వంగా ఉంద‌ని యెడియూర‌ప్ప అన్నారు. శిఖారిపురా నియోజ‌క‌వ‌ర్గాన్ని అన్ని రంగాల్లో అభివ్రుద్ధి చేశాన‌న్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి:

Chanu Saikhom Mirabai | క‌ట్టెలు మోసిన చేతులే సిల్వ‌ర్ మెడ‌ల్ తీసుకొచ్చాయి

మీరాబాయి చానుకు మంత్రి కేటీఆర్‌ అభినందన

Tokyo Olympics: తొలి గోల్డ్ మెడ‌ల్ చైనా ఖాతాలో.. ఇండియ‌న్ షూట‌ర్లు ఫెయిల్‌

చరిత్రలో ఈరోజు.. దేశ ఆర్థిక వ్యవస్థను మార్చిన బడ్జెట్‌ ఇది

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana