మంగళవారం 26 మే 2020
National - May 13, 2020 , 12:24:45

విరాళంగా ర‌వాణా ఉద్యోగుల ఒక‌రోజు వేత‌నం

విరాళంగా ర‌వాణా ఉద్యోగుల ఒక‌రోజు వేత‌నం

బెంగ‌ళూరు: క‌ర్ణాట‌క సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఆ రాష్ట్ర ర‌వాణా శాఖలోని నాలుగు ట్రాన్స్‌పోర్టు విభాగాల ఉద్యోగులు ఒక‌రోజు వేత‌నం విరాళంగా ఇచ్చారు. క‌ర్ణాట‌క రాష్ట్ర రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేష‌న్ (కేఎస్ఆర్టీసీ), బెంగ‌ళూరు మెట్రో ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేష‌న్ (బీఎంటీసీ), నార్త్ ఈస్ట్ క‌ర్ణాట‌క రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేష‌న్ (ఎన్ఈకేఆర్టీసీ), నార్త్ వెస్ట్ కర్ణాట‌క రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేష‌న్ (ఎన్‌డ‌బ్ల్యూకేఆర్టీసీ) విభాగాల‌కు చెందిన అంద‌రు ఉద్యోగులు త‌మ ఒక‌రోజు వేత‌నాన్ని విరాళంగా స‌మ‌ర్పించారు. ఈ మేర‌కు ఆ మొత్తాన్ని చెక్కు రూపంలో క‌ర్ణాట‌క ర‌వాణా శాఖ మంత్రి ల‌క్ష్మ‌ణ్ స‌వాడికి అందించ‌గా.. ఆయ‌న త‌న చేతుల మీదుగా ఆ చెక్కును ముఖ్య‌మంత్రి బీఎస్ యెడియూర‌ప్ప‌కు అంద‌జేశారు.    

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo