శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 12, 2020 , 14:35:19

ప‌ర్యాట‌క శాఖ మంత్రికి క‌రోనా పాజిటివ్

ప‌ర్యాట‌క శాఖ మంత్రికి క‌రోనా పాజిటివ్

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క ప‌ర్యాట‌క శాఖ మంత్రి సీటీ ర‌వికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. క‌ర్ణాట‌క‌లో ఓ మంత్రికి క‌రోనా సోక‌డం ఇదే ప్ర‌థ‌మం అని వైద్యాధికారులు వెల్ల‌డించారు. ఈ వారం రోజుల్లో తాను రెండుసార్లు క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నాను. అందులో మొద‌టి ఫ‌లితం నెగిటివ్ రాగా, రెండో ఫ‌లితం పాజిటివ్ వ‌చ్చింద‌ని మంత్రి ర‌వి తెలిపారు. మూడోసారి కూడా త‌న న‌మూనాల‌ను పంపించాను. ఆ ఫ‌లితం కోసం ఎదురుచూస్తున్న‌ట్లు మంత్రి చెప్పారు. ప్ర‌స్తుతానికి సీటీ ర‌వి హోం క్వారంటైన్ లో ఉన్నారు. త‌న‌కు క‌రోనా ల‌క్ష‌ణాలు లేవ‌ని చెప్పారు. 

క‌ర్ణాట‌క‌లో శ‌నివారం ఒక్క‌రోజే కొత్త‌గా 2,798 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 70 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా ఆ రాష్ర్టంలో పాజిటివ్ కేసుల సంఖ్య 36,216కు చేర‌గా, 613 మ‌ర‌ణాలు సంభ‌వించాయి.


logo