సోమవారం 13 జూలై 2020
National - May 28, 2020 , 19:55:13

5 రాష్ర్టాలతో విమాన సంబంధాలు తెంచుకున్న కర్ణాటక

5 రాష్ర్టాలతో విమాన సంబంధాలు తెంచుకున్న కర్ణాటక

కర్ణాటక మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ నుంచి వచ్చే విమాన ప్రయాణాన్ని నిలిపివేయాలని కర్ణాటక ప్రభుత్వం  నిర్ణయం తీసుకుంది. ఈ రాష్ర్టాల నుంచి కర్ణాటకకు వచ్చే వారిలో టెస్టులు చేయగా వారిలో ఎక్కువ మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో అధిక సంఖ్యలో కరోనావైరస్‌ కేసులు నమోదవుతున్న ఈ రాష్ర్టాల నుంచి విమానాలను నిలిపివేయాలనే నిర్ణయం ప్రస్తుతానికి కేబినెట్‌ సమావేశంలో తీసుకున్నట్లు న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి జేసీ మధుస్వామి తెలిపారు. ఇతర రాష్ర్టాల నుంచి కర్ణాటకకు వచ్చే ప్రజల వల్ల కర్ణాటకలో కేసులు మరింత పెరిగే అవకాశం ఉన్నందున ఐదు రాష్ర్టాల నుంచి విమాన రవాణాను నిలిపివేయాలని నిర్ణయించామని మంత్రి మధుస్వామి అన్నారు.

మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌ నుంచి కర్ణాటకలోకి రోడ్డు మార్గంలో ప్రవేశించడానికి ప్రస్తుతం ఉన్న రోడ్డు మార్గాల ద్వారా వచ్చే వారిని తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రానివ్వొచ్చని ఆయన అన్నారు. దాదాపు రెండు నెలల లాక్డౌన్‌ తర్వాత దేశీయ విమాన ప్రయాణం సోమవారం తిరిగి ప్రారంభమైంది. కరోనా కట్టడిలో భాగంగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మరింత జాగ్రత్తలు వహిస్తుంది.


logo