బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Feb 22, 2020 , 12:19:33

ఎమ్మెల్యేల నివాసాల్లోకి జర్నలిస్టులు వెళ్లొద్దు.. స్పీకర్‌ ఆదేశం

ఎమ్మెల్యేల నివాసాల్లోకి జర్నలిస్టులు వెళ్లొద్దు.. స్పీకర్‌ ఆదేశం

బెంగళూరు : కర్ణాటక ఎమ్మెల్యేల నివాస సముదాయాల్లో మీడియాపై నిషేధం విధించారు. ఈ మేరకు ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ విశ్వేశ్వరయ్య హెగ్డే నోటీసులు జారీ చేశారు. ఎలక్ట్రానిక్‌ మరియు ప్రింట్‌ మీడియాతో పాటు కెమెరామెన్లకు ఏ సమయంలో కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోకి అనుమతించమని స్పీకర్‌ కార్యాలయం వెల్లడించింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యేలు.. తమ తమ నియోజకవర్గాల నుంచి శాసనసభకు వస్తారు. ఈ సమావేశాలకు వచ్చినప్పుడు ఎమ్మెల్యేలకు కేటాయించిన నివాస సముదాయాలకు వెళ్లడం జరుగుతుంది. ఈ సమయం ఎమ్మెల్యేలకు పూర్తిగా ప్రయివేటు సమయం.. కాబట్టి వారి నివాస సముదాయాల్లోకి వెళ్లడం సరికాదని నోటీసుల్లో పేర్కొన్నారు. ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు గృహ సముదాయం గేటు బయట జర్నలిస్టులకు ఏర్పాట్లు చేశామని స్పీకర్‌ కార్యాలయం తెలిపింది. 


logo
>>>>>>