గురువారం 26 నవంబర్ 2020
National - Oct 14, 2020 , 21:41:30

కొత్తగా 9,265 కరోనా కేసులు.. 75 మరణాలు

కొత్తగా 9,265 కరోనా కేసులు.. 75 మరణాలు

బెంగళూరు: కర్ణాటకలో కరోనా కేసులు ఏడు లక్షలు, మరణాలు పది వేల మార్కును దాటాయి. ఆ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వేల సంఖ్యలో కరోనా కేసులు, వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. మంగళవారం నుంచి బుధవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 9,265 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 75 మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,35,371కు, మరణాల సంఖ్య 10,198కు పెరిగింది. గత 24 గంటల్లో 8,662 మంది కోలుకుని దవాఖానల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో కర్ణాటకలో ఇప్పటి వరకు వైరస్‌ బారినపడిన వారిలో 6,11,167 మంది కోలుకున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం 1,13,987 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వెల్లడించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి