గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 18:47:45

కర్ణాటకలో ఒక్కరోజే 5,007 కరోనా కేసులు

కర్ణాటకలో ఒక్కరోజే 5,007 కరోనా కేసులు

బెంగళూరు: కర్ణాటకలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 5,007 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  కరోనా వల్ల ఒక్కరోజే 110 మంది మృతిచెందారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 85,870కు చేరింది. ప్రస్తుతం 52,791 మంది వివిధ ఆస్పత్రుల్లో  చికిత్స పొందుతున్నారు.

ఇప్పటి వరకు కరోనా బారినపడి 1,724 మంది చనిపోయారు. ఇప్పటి వరకు 31347 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో బెంగళూరు సహా పలుచోట్ల లాక్‌డౌన్‌ అమలు చేసినా కరోనా వ్యాప్తి ఏమాత్రం తగ్గకపోగా విపరీతంగా పెరుగుతున్నట్లు అధికారులు  గుర్తించారు. ప్రతిరోజూ బెంగళూరులోనే 2వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. 


logo