ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 06, 2020 , 18:25:43

కర్ణాటకలో కొత్తగా 5,619 కరోనా కేసులు

కర్ణాటకలో కొత్తగా 5,619 కరోనా కేసులు

బెంగళూరు : కర్ణాటక రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకూ పాజిటివ్‌కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండగా మరణాలు అంతకంతకూ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఇవాళ ఒక్కరోజే ఆ రాష్ట్రంలో కొత్తగా 5,619 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో ఇప్పటివరకు 1,51,449 మంది కరోనా వైరస్‌ బారినపడగా 73,958 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. 74,679 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జ్ కాగా 2,804 మంది మృతి చెందారని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలో సగటు రికవరీ రేటు  49.3 శాతంగా ఉందని పేర్కొంది. ఇదిలాఉండగా దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. బుధవారం ఒక్కరోజే 56,282 కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 19,64,537కు చేరింది.logo