గురువారం 13 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 21:10:02

కర్ణాటకలో కొత్తగా 5,172 కరోనా పాజిటివ్‌ కేసులు

కర్ణాటకలో కొత్తగా 5,172 కరోనా పాజిటివ్‌ కేసులు

బెంగళూరు : కర్ణాటకలో శనివారం కొత్తగా 5,172 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,852 కేసులు రాజధాని నగరం బెంగళూరు నుంచి నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,29,287 చేరగా, ఇందులో ప్రస్తుతం 73,218 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో వైరస్‌ ప్రభావంతో 98 మంది మరణించగా, ఇందులో 27 బెంగళూరులో ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,412 మంది కరోనా వైరస్‌తో చనిపోయారు. ఇవాళ 3,860 మంది శనివారం హాస్పిటళ్ల నుంచి డిశ్చార్జి కాగా, 53,648 మంది కోలుకున్నారని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo