గురువారం 22 అక్టోబర్ 2020
National - Sep 27, 2020 , 19:22:53

67,857 వేల మందిని పరీక్షిస్తే.. 9,543 వేల మందికి కరోనా

67,857 వేల మందిని పరీక్షిస్తే.. 9,543 వేల మందికి కరోనా

బెంగళూరు: కర్ణాటకలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతున్నది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో వైరస్ కేసులు వెలుగుచూశాయి. శనివారం నుంచి ఆదివారం వరకు 67,857 కరోనా పరీక్షలు నిర్వహించగా రికార్డు స్థాయిలో కొత్తగా 9,543 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 79 మంది కరోనా వల్ల మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,75,566కు, మరణాల సంఖ్య 8,582కు చేరింది. గత 24 గంటల్లో 6,522 మంది కోలుకుని దవాఖానల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కర్ణాటకలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,62,241కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం 1,04,724 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది. ఒక్క బెంగళూరు నగరంలోనే 44,274 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo