కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ.. 14 మంది అరెస్ట్

బెంగళూరు : కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎఫ్‌డీఏ పరీక్ష లీకేజీ వ్యవహారంలో 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు. శనివారం రాత్రి బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రశ్నాపత్రం లీకేజీ రాకెట్ గుట్టును రట్టు చేశారు. దీంతో ఆదివారం జరగాల్సిన మొదటి డివిజన్ అసిస్టెంట్ పరీక్షను అధికారులు రద్దు చేశారు. ఇప్పటి లీకేజీ వ్యవహారంలో 14 మందిని అరెస్టు చేశామని, రూ.35లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు క్రైమ్ జాయింట్ సీపీ సందీప్ పాటిల్ ఆదివారం తెలిపారు. శనివారం సీసీబీ ప్రత్యేక బృందం జ్ఞానభారతి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉల్లాల్‌లో దాడులు నిర్వహించి, చంద్రుని, రాచప్ప రెడ్ హ్యాండ్‌తో పాటు మరో నలుగురిని అరెస్టు చేసింది. కొద్దిరోజుల క్రితం తమను సంప్రదించిన ఉద్యోగ ఆశావాహులకు ప్రశ్నపత్రాలను అందించేందుకు ఈ ముఠా దొంగిలించిన వాహనాలను ఉపయోగిస్తుందని పోలీసులు తెలిపారు. రాష్ట్రస్థాయి ఫస్ట్ డివిజన్ అసిస్టెంట్ పోస్టులకు 1,112 ఖాళీల కోసం కేపీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తోంది. ఇందులో 975 ఆర్పీసీ పోస్టులు, హైదరాబాద్ కర్ణాటక లోకల్ కేడర్ (హెచ్‌కే)లో 137 పోస్టులకు కోసం సుమారు 3.75 లక్షల మంది ఉద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
తాజావార్తలు
- అభివృద్ధి పనుల్లో జాప్యం చేయొద్దు..
- వాస్తవాలకు అండగా నిలువండి
- ఆకట్టుకునేలా.. అక్కంపల్లి
- సీఎం సారూ.. మీ మేలు మరువం
- మాధవపల్లి సర్పంచ్, కార్యదర్శులకు నోటీసులు
- జోరుగా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు
- ఆహ్లాదం పంచని ప్రకృతి వనం!
- బలహీనంగా ఉన్న పిల్లలకు రెట్టింపు పౌష్టికాహారం
- మాతా శిశు మరణాల శాతం తగ్గించాలి
- రసవత్తరంగా రణరంగం