గురువారం 09 జూలై 2020
National - Jun 23, 2020 , 09:15:08

గుడిలో తీర్థ‌మిచ్చే యంత్రం వ‌చ్చేసిందోచ్‌!

గుడిలో తీర్థ‌మిచ్చే యంత్రం వ‌చ్చేసిందోచ్‌!

క‌రోనా దెబ్బ‌కి ఎక్క‌డికి వెళ్లాల‌న్నా భ‌యం. ఆల‌యాలు తెరుచుకున్న‌ప్ప‌టికీ వెళ్లేందుకు సంకోచిస్తున్నారు. అంద‌రూ చేతుల‌తో తాకే గంట‌ను ప‌ట్టుకుంటే ఎక్క‌డ క‌రోనా వ‌స్తుందో, పూజారి ఇచ్చే తీర్థం తాగితే ఏమ‌వుతుందో అని భ‌యం భ‌యంగానే గుళ్లో అడుగుపెడుతున్నారు భ‌క్తులు. ఇటీవల ఓ గుడిలో భక్తులు తాకకుండానే మోగే సెన్సార్ గంటను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అలానే తీర్థ‌మిచ్చే యంత్రాన్ని కూడా క‌నుగొన్నారు క‌ర్ణాట‌కలోని మంగ‌ళూరుకు చెందిన ప్రొఫెస‌ర్ సంతోష్. 'తీర్థ డిస్పెన్స‌ర్' అనే పేరుతో యంత్రాన్ని త‌యారు చేశారు. ఇది సెన్సార్ల‌తో ప‌నిచేస్తుంది.

పూజారి ఇచ్చే తీర్థాన్ని ఒక బిందెలో పోసి పెడితే చాలు. ఈ యంత్ర‌మే ఆటోమేటిక్‌గా తీర్థం తీసుకుంటుంది. ఇక భ‌క్తులు వ‌చ్చి పూజారి ద‌గ్గ‌ర చేయి చాచిన‌ట్లుగా యంత్రం ద‌గ్గ‌ర చేయి పె‌డితే చాలు సెన్సార్ ద్వారా తీర్థం వ‌చ్చి చేతిలో ప‌డుతుంది. ఈ యంత్రం త‌యారీకి రూ. 2700 ఖ‌ర్చ‌యింద‌ని సంతోష్ చెప్పుకొచ్చారు. త్వరలోనే ఈ సరికొత్త ఆవిష్కరణలు అన్ని ఆలయాల్లో కనిపించనున్నాయి. ఇవి ఉంటే దేవుడి గుడిలో క‌రోనా గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకోవ‌చ్చు. logo