శనివారం 11 జూలై 2020
National - Apr 19, 2020 , 06:48:17

కరోనా యోధుల కోసం 3 లక్షల పీపీఈ కిట్స్‌ ఆర్డర్‌

కరోనా యోధుల కోసం 3 లక్షల పీపీఈ కిట్స్‌ ఆర్డర్‌

బెంగళూరు : కరోనా పోరాట యోధుల రక్షణార్థం కర్ణాటక ప్రభుత్వం 3 లక్షల పర్సనల్‌ ప్రొటక్టివ్‌ ఎక్యూప్‌మెంట్‌(పీపీఈ) కిట్లు ఆర్డర్‌ చేసింది. వీటిలో డీహెచ్‌బీ గ్లోబల్‌ నుంచి 2 లక్షలు, అదేవిధంగా ఇతర మేజర్‌ ఫార్మాసుటికల్స్‌ నుంచి మరో లక్ష పీపీఈ కిట్స్‌ ఆర్డర్‌ చేసింది. రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం... పీపీఈ కిట్‌లో అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించి మొత్తం 10 రకాల వస్తువులు ఉండనున్నట్లు తెలిపింది. ఫేస్‌ మాస్క్‌, గాగుల్స్‌, ఎన్‌95 మాస్క్‌లు, సర్జికల్‌ మాస్కులు, నిట్రైల్‌ గ్లౌవ్స్‌, కవర్‌ సూట్స్‌, షూ కవర్స్‌, వేస్ట్‌ డిస్పోజల్‌ బ్యాగ్‌, ప్లాస్టిక్‌ ఆప్రాన్‌, ప్రొటక్టివ్‌ గేర్‌ వంటి వస్తువులు ఉండనున్నట్లు తెలిపింది.


logo