శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 12:46:41

యాక్టివ్‌ కేసులు...మహారాష్ట్ర తర్వాత కర్ణాటకలోనే!

యాక్టివ్‌ కేసులు...మహారాష్ట్ర తర్వాత కర్ణాటకలోనే!

బెంగళూరు: కర్ణాటకలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు శనివారం కూడా 5వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో అత్యధికంగా కరోనా యాక్టివ్‌ కేసులు(55,388)న్న రెండో రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. ఈ క్రమంలోనే తమిళనాడును మూడో స్థానానికి నెట్టింది.  1.45లక్షల యాక్టివ్‌ కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో కొనసాగుతోంది.  శనివారం మరో 5,072 కొత్త కేసులు నమోదవడంతో కర్ణాటకలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య  90,942కు చేరింది. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్యలో దేశంలోనే కర్ణాటక ఐదో స్థానంలో ఉన్నది.  కరోనా బాధితుల సంఖ్యలో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ,  ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక  టాప్‌-5లో ఉన్నాయి. 


logo