శనివారం 04 జూలై 2020
National - Jun 23, 2020 , 09:48:39

వైద్య విద్యాశాఖ మంత్రి భార్య, కుమార్తెకు కరోనా పాజిటివ్‌

వైద్య విద్యాశాఖ మంత్రి భార్య, కుమార్తెకు కరోనా పాజిటివ్‌

బెంగళూరు: కర్ణాటక వైద్య విద్యాశాఖ మంత్రి కె. సుధాకర్‌ కుటుంబ సభ్యులు కరోనా బారినపడ్డారు.  తాజాగా సుధాకర్‌ భార్య, కుమార్తెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సుధాకర్‌తో పాటు అతని ఇద్దరు కుమారుల శాంపిల్స్‌ పరీక్షించగా కరోనా నెగెటివ్‌గా వచ్చింది.   తమ కుటుంబసభ్యులకు కరోనా సోకడం దురదృష్టకరమని మంగళవారం మంత్రి ట్వీట్‌ చేశారు. 

'మా కుటుంబ సభ్యుల కోవిడ్‌-19 పరీక్ష ఫలితాలు వచ్చాయి. దురదృష్టవశాత్తు నా భార్య, కుమార్తెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నా ఇద్దరు కుమారులతో పాటు నాకు కరోనా  నెగెటివ్‌  వచ్చింది.  మా క్షేమం కోరిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు' అంటూ మంత్రి ట్వీట్‌ చేశారు. 

సుధాకర్‌ తండ్రి(82) జ్వరం, దగ్గుతో బాధపడుతుండటంతో ఆస్పత్రికి తీసుకెళ్లి కరోనా పరీక్షలు నిర్వహించారు. సోమవారం మంత్రి తండ్రికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా తేలడంతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఇటీవల మంత్రి ఇంట్లో వంట మనిషికి కూడా కరోనా వచ్చింది. 


logo