బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 17, 2020 , 12:45:53

ఏసీలో మంటలు.. మంత్రికి తప్పిన ప్రమాదం

ఏసీలో మంటలు.. మంత్రికి తప్పిన ప్రమాదం

బెంగళూరు : కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప నివాసంలో నిన్న రాత్రి స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరులోని కుమార పార్క్‌ సౌత్‌లోని ప్రభుత్వ బంగ్లాలో ఈశ్వరప్ప తన కుటుంబంతో కలిసి ఉంటున్నారు. అయితే సోమవారం రాత్రి 10 గంటలకు నిద్రకు ఉపక్రమించే సమయంలో ఏసీని ఆన్‌ చేశారు మంత్రి. తక్షణమే ఏసీలో నుంచి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ఈశ్వరప్ప తన భార్యతో కలిసి బయటకు పరుగు పెట్టారు.

అగ్నిప్రమాద విషయాన్ని తన అల్లుడి దృష్టికి తీసుకువచ్చారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మంత్రి నివాసానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసింది. ఏసీలో చెలరేగిన మంటలకు బెడ్‌రూం పూర్తిగా ధ్వంసమైంది. ఏసీతో పాటు బెడ్‌, సోఫా, పరుపులు, అల్మారా పూర్తిగా కాలిపోయాయి. మంత్రి ఈశ్వరప్పతో పాటు ఆయన భార్య ఈ ప్రమాదం నుంచి బయటపడడంతో బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. 


logo