మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 13, 2020 , 09:35:41

క‌ర్నాట‌క మంత్రికి క‌రోనా పాజిటివ్‌

క‌ర్నాట‌క మంత్రికి క‌రోనా పాజిటివ్‌

బెంగ‌ళూరు : క‌ర్నాట‌క రాష్ట్ర మంత్రి సీటీ ర‌వి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. కాగా, ఆయ‌న భార్య‌, సిబ్బందికి మాత్రం నెగెటివ్‌గా వ‌చ్చాయి. ఈ విష‌యాన్ని ఆయ‌న ట్విట్ట‌ర్ ద్వారా ధ్రువీక‌రించారు. 'నిన్న నేను నా భార్య ప‌ల్ల‌వితో పాటు నా సిబ్బంది కొవిడ్‌-19 ప‌రీక్ష‌లు చేయించాను. అదృష్ట‌వ‌శాత్తు నా భార్య‌, నా సిబ్బంది అంద‌రికీ నెగెటివ్‌గా వ‌చ్చింది. ఆదివారం రాత్రి థర్డ్ అంపైర్ ఫ‌లితాల్లో పాజిటివ్‌గా తేలింది' అని ధ్రువీక‌రించారు. అయితే, నేను పూర్తిగా బాగానే ఉన్నాను అని రవి ట్వీట్ చేశారు. ప్రస్తుతానికి ఇక్కడి నుంచే పని చేసి చేస్తూ చికిత్స తీసుకుంటాన‌ని, త్వరలోనే కోలుకొని మీ అందరి దగ్గర పని చేయడానికి వస్తాను అని పేర్కొన్నారు. ఇప్పటి వరకు కర్ణాటక 36,216 క‌రోనా పాజిటివ్ కేసులు నమోదు చేసినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.logo