మంగళవారం 27 అక్టోబర్ 2020
National - Oct 01, 2020 , 19:40:51

కుక్క‌ను చుట్టేసిన‌‌ 20 అడుగుల కొండ‌చిలువ‌.. చివ‌రికీ!

కుక్క‌ను చుట్టేసిన‌‌ 20 అడుగుల కొండ‌చిలువ‌.. చివ‌రికీ!

ఎక్క‌డో అడ‌వుల్లో నివ‌సించాల్సిన కొండ‌చిలువ‌లు మ‌నుషులు మ‌ధ్య తిరిగేందుకు అల‌వాటు ప‌డ్డ‌ట్లున్నాయి. ఇంట్లోకి చొర‌బ‌డి అంద‌రినీ భ‌య‌పెడుతున్నాయి. వీలైతే ల‌టుక్కున మింగేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాయి. అస‌లు రోడ్డు మీద ఎవ‌రికీ తార‌స‌ప‌డ‌కుండా 20 అడుగుల పొడ‌వున్న పైథాన్ ఇంటి వ‌ర‌కు ఎలా వ‌చ్చిందో కాని పాపం ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న కుక్క‌ను మింగ‌డానికి విశ్వ ప్ర‌య‌త్నం చేసింది. కుక్క‌ను ఎటూ పోనివ్వ‌కుండా తోక‌తో గ‌ట్టిగా చుట్టేసింది. భ‌యంతో కుక్క అర‌వ‌సాగింది.

దాని అరుపులు విన్న ర‌వి  అనే య‌జ‌మాని ఇంటి బ‌య‌ట‌కు వ‌చ్చి చూశాడు. కుక్క‌ను చుట్టేసిన పైథాన్‌ను చూసి నివ్వెర‌పోయాడు. య‌జ‌మాని గ‌జ‌గ‌జ వ‌ణికిపోయాడు. వెంట‌నే ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన త‌న స్నేహితురాలు రాజీవ గౌడకు ఫోన్ చేసి స‌హాయం కోరాడు. పైథాన్ నుంచి కుక్క‌ను కాపాడేందుకు అట‌వీ శాఖ‌కు గంటకు పైగా స‌మ‌యం ప‌ట్టింది. కుక్క‌ను మాత్రం సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీశారు. ఈ పైథాన్‌ను స‌మీపంలోని రిజ‌ర్వ్ ఫారెస్ట్‌లోకి విడుద‌ల చేశారు. ఈ సంఘ‌ట‌న మ‌రెక్క‌డో కాదు క‌ర్ణాట‌క‌లోని ఉడిపిలో చోటు చేసుకున్న‌ది. 


logo