శనివారం 29 ఫిబ్రవరి 2020
బర్రెలతో రేస్‌ చేసి.. బోల్ట్‌ను మించేశాడు

బర్రెలతో రేస్‌ చేసి.. బోల్ట్‌ను మించేశాడు

Feb 14, 2020 , 14:54:08
PRINT
బర్రెలతో రేస్‌ చేసి.. బోల్ట్‌ను మించేశాడు

ప్రపంచంలో అత్యంత వేగంగా పరుగెత్తేది ఎవరంటే.. జమైకాకు చెందిన ఉసెన్‌ బోల్ట్‌ గురుకొస్తారు. 100 మీటర్ల రన్నింగ్‌లో ప్రపంచ రికార్డు సృష్టించాడు ఉసెన్‌. ఆ దూరాన్ని కేవలం 9.58 సెకన్లలో పూర్తి చేసి బోల్ట్‌ ఔరా అనిపించాడు. బోల్ట్‌ తరహాలో కర్ణాటకకు చెందిన శ్రీనివాస గౌడ(28) బర్రెలతో రన్నింగ్‌ రేస్‌ చేసి ప్రశంసలు అందుకుంటున్నాడు. కర్ణాటకలోని ఉడుపి, మంగళూరులో బర్రెలతో రన్నింగ్‌ రేస్‌(కంబాలా) అనే సంప్రదాయ పండుగను జరుపుకుంటారు. బురద నేలల్లో ఈ క్రీడను నిర్వహిస్తారు. అయితే శ్రీనివాస గౌడ తన రెండు బర్రెలతో రన్నింగ్‌ చేస్తూ.. 142.50 మీటర్లను కేవలం 13.62 సెకన్లలో చేరుకున్నాడు. అంటే 100 మీటర్లను కేవలం 9.55 సెకన్లలో చేరుకుని బోల్ట్‌ కంటే మెరుగ్గా తన ప్రతిభను చాటాడు. ఈ సందర్భంగా శ్రీనివాస గౌడ మాట్లాడుతూ.. కంబాలా ఫెస్టివల్‌ అంటే తనకు ఇష్టం. ఈ పండుగలో ప్రతి ఏడాది పాల్గొంటాను. ఈ విజయం తన బర్రెల వల్లే సాధ్యమైంది.. ఈ క్రెడిట్‌ బర్రెలదే అని శ్రీనివాస గౌడ తెలిపాడు. 


logo