శుక్రవారం 04 డిసెంబర్ 2020
National - Oct 28, 2020 , 10:48:31

భార్యపై అనుమానం.. ఆ దృశ్యాలు ఫేస్‌బుక్‌లో..

భార్యపై అనుమానం.. ఆ దృశ్యాలు ఫేస్‌బుక్‌లో..

బెంగళూరు :  బెంగళూరులో అమానుష ఘటన చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో కోపం పెంచుకున్న భర్త ఆమెతో సన్నిహితంగా ఉన్న వీడియోలను, ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంతోపాటు స్నేహితులకు సైతం పంపాడు. విషయాన్ని గుర్తించిన  భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కటకటాల పాలయ్యాడు. నర్సింగ్‌ సేవలందించే సంస్థలో పనిచేసే రష్మీ (29 ) (పేరు మార్చాం) ఏడాది క్రితం హరికృష్ణ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది.

రష్మీకి 2008లోనే షఫిక్‌ అనే వ్యక్తితో వివాహం కాగా అతడితో విడిపోయి 2015 విడాకులు తీసుకుంది. కొంతకాలంగా భార్యకు మరొకరితో సంబంధం ఉందని అనుమానిస్తున్న హరికృష్ణ ఆమెతో ఏకాంతంగా ఉన్న సమయంలో తెలియకుండా వీడియోలు రికార్డు చేశాడు. వీటిని సోషల్‌మీడియాతోపాటు స్నేహితులతో పంచుకున్నాడు.  రష్మీ ఇటీవల ఫేస్‌బుక్‌ చూస్తుండగా ఈ వీడియోలు కంటబడటంతో పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు హరికృష్ణను అదుపులోకి తీసుకున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు