గురువారం 28 మే 2020
National - May 13, 2020 , 18:17:06

మే 17 తర్వాత జిమ్‌లు ఓపెన్‌

మే 17 తర్వాత జిమ్‌లు ఓపెన్‌

బెంగళూరు: ఈ నెల 17 తర్వాతి నుంచి లాక్‌డౌన్‌ నాలుగో దశ ప్రారంభం కానున్న నేపథ్యంలో జిమ్‌లు, ఫిట్‌నెస్‌ సెంటర్లు, గోల్ఫ్‌ కోర్స్‌లు ప్రారంభించేందుకు కర్ణాటక ప్రభుత్వం  సన్నద్ధమవుతున్నది. ఈ విషయాన్ని బుధవారం ఆ రాష్ట్ర టూరిజం, క్రీడలశాఖ మంత్రి  సీటీ రవి స్పష్టంచేశారు. ముఖ్యమంత్రితో ఈ విషయమై చర్చలు జరిపానని, ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని  చెప్పారు. స్థానికంగా టూరిజంకు జవసత్వాలు కల్పించేందుకు హోటళ్లను తెరిచే విషయంపై కూడా చర్చించామన్నారు. భౌతిక దూరం పాటిస్తూ మాస్క్‌లు, శానిటైజర్లు విధిగా వాడే జిమ్‌లు, ఫిట్‌నెస్‌ సెంటర్లకు ఈ నెల 17 తర్వాత అనుమతిస్తామని ముఖ్యమంత్రి సూత్రప్రాయంగా చెప్పారని మంత్రి రవి తెలిపారు.


logo