మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 20:40:55

బెంగళూరు నుంచి ఆర్టీసీ బస్సుల పునరుద్ధరణ

బెంగళూరు నుంచి ఆర్టీసీ బస్సుల పునరుద్ధరణ

బెంగళూరు : లాక్‌డౌన్‌ నేపథ్యంలో బెంగళూర్‌ నుంచి  ఇతర ప్రాంతాలకు నిలిపివేసిన ఆర్టీసీ బస్సు సర్వీసులను బుధవారం ఉదయం 6గంటల నుంచి తిరిగి పునరుద్ధరించనున్నట్లు కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ ఆర్టీసీ) మంగళవారం ప్రకటించింది. రేపటితో బెంగళూర్‌లో లాకడౌన్ ముగుస్తున్నందన ఇతర ప్రాంతాలకు బస్సులు నడుపనున్నట్లు తెలిపింది. బెంగళూర్‌ అర్బన్, రూరల్ జిల్లాల్లో లాక్‌డౌన్ పొడిగింపు ఉండదని ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప ప్రకటించిన తరువాత బస్సులను పునరుద్ధరించాలని ఆ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్ణయించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం జులై 15నుంచి బెంగళూరులో లాక్‌డౌన్‌ విధించగా బుధవారం ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉండనుంది. జులై 14న కేఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ అన్నిరవాణాశాఖ డిప్యూటీ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్రంలో బస్సులు సజావుగా నడిపే అంశాలపై చర్చించారు.


logo