శనివారం 05 డిసెంబర్ 2020
National - Aug 16, 2020 , 20:14:56

కరోనా నుంచి కోలుకున్న కర్ణాటక ఆరోగ్య మంత్రి శ్రీరాములు

కరోనా నుంచి కోలుకున్న కర్ణాటక ఆరోగ్య మంత్రి శ్రీరాములు

బెంగళూరు: కర్ణాటక ఆరోగ్య మంత్రి బీ శ్రీరాములు కరోనా నుంచి కోలుకున్నారు. బెంగళూరులోని బౌరింగ్, లేడీ కర్జన్ మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్‌లో చికిత్స పొందిన ఆయన ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు. శ్రీరాములకు గత ఆదివారం కరోనా సోకింది. జ్వరంగా ఉండటంతో కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు గతవారం ట్విట్టర్‌లో ఆయన తెలిపారు. కరోనా ప్రబలినప్పటిప్పటి నుంచి రాష్ట్రంలోని 30 జిల్లాల్లో పర్యటిస్తూ కరోనా రోగులకు అందుతున్న చికిత్సలు, సౌకర్యాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నానని, ఈ క్రమంలో తనకు కరోనా సోకడంతో దవాఖానలో చేరినట్లు శ్రీరాములు చెప్పారు. కరోనా బారి నుంచి మనల్ని ఆ దేవుడు తప్ప ఎవరూ కాపాడలేరంటూ శ్రీరాములు ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి.

కాగా, కర్ణాటక సీఎం యెడియూరప్ప, మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యతోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కూడా కరోనా బారినపడి కోలుకున్నారు. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 2.20 లక్షల మందికి కరోనా సోకగా 3,831 మంది మరణించారు.