శనివారం 30 మే 2020
National - May 08, 2020 , 09:06:43

వ‌ల‌స కూలీల‌ను పంప‌లేమంటున్న‌ క‌ర్ణాట‌క

వ‌ల‌స కూలీల‌ను పంప‌లేమంటున్న‌ క‌ర్ణాట‌క

బెంగ‌ళూర్: వ‌ల‌స కూలీల‌ను స్వంత ప్రాంతాల‌కు పంపించ‌డంపై క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం యూ ట‌ర్న్ తీసుకుంది. ఈ మేర‌కు అక్క‌డి ముఖ్య‌మంత్రి అనుస‌రిస్తున్న తీరు వివాద‌స్పదంగా మారింది. వాస్త‌వానికి వలస కూలీలను స్వస్థలాలకు తరలించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం అప్పగించింది. చాలావ‌ర‌కు కూలీలు సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్ర‌మంలోనే  రాష్ట్రంలో నిర్మాణ పనుల కోసం వలస కూలీలు కావాలని, అందువల్ల వాళ్లను పంపేది లేదని అక్క‌డి ప్ర‌భుత్వం చెపుతుంది.

ఇప్ప‌టికే కర్ణాటక నుంచి రోజుకు రెండు చొప్పున వెళ్తున్న స్పెషల్‌ ట్రైన్స్‌లో పెద్ద సంఖ్యలోనే వలస కార్మికులను స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. ఇలా ఇంత వరకూ 8 రైళ్లలో జనాన్ని తరలించారు అధికారులు. అయితే, కార్మికులు వెళ్లిపోతే నిర్మాణ పనులు ఆగిపోతాయనే కార‌ణంతో వారిని పంపించే ఎనిమిది ప్రత్యేక రైళ్లను రద్దు చేయాల్సిందిగా రైల్వే శాఖకు కర్ణాట‌క అధికారులు లేఖరాశారు. దీంతో తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు రావ‌డంతో వెన‌క్కిత‌గ్గింది ప్ర‌భుత్వం. వెంట‌నే దిద్దుబాటు చ‌ర్య‌లు ప్రారంభించింది ప్రభుత్వం. దీనిలో భాగంగా 3 రైళ్లలో వలస కూలీలను గమ్యస్థానాలకు చేర్చేందుకు నిర్ణయించింది. logo