మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 23:27:02

ప్రైవేట్‌ ల్యాబుల్లో కరోనా పరీక్షల ధరల నిర్ణయం

ప్రైవేట్‌ ల్యాబుల్లో కరోనా పరీక్షల ధరల నిర్ణయం

బెంగళూర్‌ : కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్‌ ల్యాబుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలకు శుక్రవారం ధరలను నిర్ణయిస్తూ ఉత్తర్వును జారీ చేసింది. రాష్ట్ర టాస్క్ఫోర్స్ కమిటీ సిఫార్సు మేరకు పరీక్షల రేటును సవరించింది. ఆర్టీ పీసీఆర్‌ పరీక్షకు రూ.2,000, ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షకు రూ.700 అవుతుందని తెలిపింది. ప్రైవేట్‌లో నమూనాల సేకరించి  స్క్రీనింగ్ పరీక్ష, ధ్రువీకరణ పరీక్ష చేస్తే రూ. 3,000గా నిర్ణయించినట్లు ఆదేశాల్లో పేర్కొంది. కర్ణాటకలో శుక్రవారం కొత్త 5,007 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 110 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు  85,870 నమోదుకాగా, ఇందులో 52,791 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతుండగా 1,724 మంది మృతి చెందారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.


logo