గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 23:15:48

కర్ణాటకలో ఆయుశ్‌ వైద్యుల వేతనాలు పెంపు

కర్ణాటకలో ఆయుశ్‌ వైద్యుల వేతనాలు పెంపు

బెంగళూరు : వచ్చే 6 నెలలపాటు ఆయుశ్‌ వైద్యుల జీతాలు పెంచుతూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంగళవారం వైద్య విద్యశాఖ మంత్రి డాక్టర్ సుధాకర్ అధ్యక్షతన జరిగిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయుశ్‌ వైద్యులకు నెలకు రూ.48 వేలు, ఎంబీబీఎస్ వైద్యులకు రూ.80 వేలు, నర్సులకు రూ.30 వేల వేతనం అందనుందని డాక్టర్ సుధాకర్ తెలిపారు.

రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలను పెంచేందుకు 4 లక్షల యాంటీజెన్ పరీక్ష కిట్లు, 5లక్షల స్వాబ్ టెస్టు కిట్లను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రైవేటు ల్యాబుల్లో కరోనా పరీక్షలకు (ప్రభుత్వం పంపితే)రూ.2,వేలు, వ్యక్తిగతంగా చేయించుకుంటే రూ.3 వేలుగా ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అధిక ధరలు వసూలు చేసే ప్రైవేట్‌ దవాఖానలపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానల్లో అందుబాటులో ఉన్న రెమిడెసివిర్‌ను ప్రైవేటు దవాఖానకు సరఫరా చేస్తామని ఆయన వెల్లడించారు.logo