మంగళవారం 19 జనవరి 2021
National - Dec 24, 2020 , 17:37:05

రాత్రి పూట క‌ర్ఫ్యూ లేదు.. క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం యూట‌ర్న్‌

రాత్రి పూట క‌ర్ఫ్యూ లేదు.. క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం యూట‌ర్న్‌

బెంగ‌ళూరు: క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ఒక్క రోజులోనే రాత్రి పూట క‌ర్ఫ్యూపై యూట‌ర్న్ తీసుకుంది. దీనికి సంబంధించిన ఆదేశాల‌ను గురువారం ఉప‌సంహ‌రించుకుంది. ప‌రిస్థితిని స‌మీక్షించిన త‌ర్వాత టెక్నిక‌ల్ అడ్వైజ‌రీ క‌మిటీ సూచ‌న మేర‌కు రాత్రి పూట క‌ర్ఫ్యూ ఆదేశాల‌ను ఉప‌సంహ‌రించుకున్న‌ట్లు ముఖ్య‌మంత్రి కార్యాల‌యం ప్ర‌క‌టించింది. ప్ర‌తి రోజూ రాత్రి 11 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంటల వ‌ర‌కూ క‌ర్ఫ్యూ ఉంటుంద‌ని బుధ‌వారం విడుద‌ల చేసిన ఆదేశాల్లో ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది. అయితే దానిని అమ‌లు చేయ‌డానికి కొన్ని గంటల ముందే ఆ ఆదేశాల‌ను వెన‌క్కి తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.