బుధవారం 03 మార్చి 2021
National - Feb 23, 2021 , 12:51:38

పెళ్లిళ్ల‌లో మార్ష‌ల్స్‌.. మాస్క్ పెట్టుకోక‌పోయారో..

పెళ్లిళ్ల‌లో మార్ష‌ల్స్‌.. మాస్క్ పెట్టుకోక‌పోయారో..

బెంగ‌ళూరు: దేశంలో మ‌ళ్లీ క‌రోనా విజృంభిస్తోంది. మ‌హారాష్ట్ర స‌హా కొన్ని రాష్ట్రాల్లో కేసులు సంఖ్య పెరుగుతోంది. దీంతో క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇక నుంచి పెళ్లిళ్ల‌తోపాటు ప‌బ్లిక్ ఈవెంట్ల‌లో మార్ష‌ల్స్‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించింది. వాటికి హాజ‌ర‌య్యే వాళ్లు క‌చ్చితంగా కొవిడ్ నిబంధ‌న‌లు పాటించేలా చూడ‌ట‌మే వీళ్ల ప‌ని. ఇలాంటి కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రవుతున్న వాళ్లు కొవిడ్ నిబంధ‌న‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, తాను కూడా అలాంటి కార్య‌క్ర‌మానికి వెళ్లిన‌ప్పుడు మాస్క్ తీసేయ‌మ‌ని అడిగార‌ని క‌ర్ణాట‌క ఆరోగ్య శాఖ మంత్రి సుధాక‌ర్ చెప్పారు. 

అందుకే పెళ్లిళ్ల‌తోపాటు ప‌బ్లిక్ ఈవెంట్ల‌లో మార్ష‌ల్స్‌ను నియ‌మించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు. ఇలాంటి కార్య‌క్ర‌మాల‌పై కేంద్ర ప్ర‌భుత్వం కూడా  ఈ మ‌ధ్యే మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. స‌ద‌రు హాల్ సామ‌ర్థ్యంలో స‌గం లేదా గ‌రిష్ఠంగా 500 మంది వ‌ర‌కే అనుమ‌తించింది. అయితే మ‌హారాష్ట్ర‌లాంటి ప‌రిస్థితి త‌మ‌కు రాకుండా ఉండాల‌ని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సుధాక‌ర్ చెప్పారు. ఇప్ప‌టికే కొన్ని క‌ఠిన నిబంధ‌న‌ల‌ను ఆ రాష్ట్రం అమ‌లు చేస్తోంది. కేర‌ళ‌, మ‌హారాష్ట్ర నుంచి క‌ర్ణాట‌క‌కు వ‌చ్చేవాళ్లు కొవిడ్ నెగ‌టివ్ రిపోర్ట్‌తోనే రావాల‌ని స్ప‌ష్టం చేసింది. క‌ర్ణాట‌క‌లో కొవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. గ‌త వారం బెంగ‌ళూరులోనే 2 వేల కేసులు న‌మోద‌య్యాయి. 

VIDEOS

logo