బుధవారం 25 నవంబర్ 2020
National - Nov 22, 2020 , 17:21:22

పాఠశాలల ప్రారంభంపై రేపు కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం

పాఠశాలల ప్రారంభంపై రేపు కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం

హైదరాబాద్‌ : కర్ణాటకలో పాఠశాలల పునః ప్రారంభంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం తుది నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే ఈ విషయంపై విద్యార్థుల తల్లిదండ్రులు, ఆరోగ్య కమిటీ అధికారులతోపాటు విద్యారంగ నిపుణుల నిర్ణయాన్ని తీసుకున్న ప్రభుత్వం.. సాధ్యాసాధ్యాలపై చర్చించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప, విద్యాశాఖ మంత్రి ఎస్‌ సురేశ్‌ కుమార్‌ విద్యాశాఖ ఉన్నతాధికారులతో రేపు బెంగళూర్‌లో సమావేశం కానున్నారు.

సమావేశంలో పలు అంశాలను చర్చించి పాఠశాలలను ప్రారంభించనున్నది.. లేదని ప్రకటిస్తారు. విద్యారంగ నిపుణులు, వైద్యాధికారుల సలహాలు, సూచనలకు అనుగుణంగా ఇప్పటికే రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలను, ఉన్నతా విద్యాసంస్థను ప్రభుత్వం తెరిచింది. డిసెంబర్‌ నుంచి ఉన్నత పాఠశాలల్లో ఆఫ్‌లైన్‌ తరగతులు ప్రారంభించాలని నిపుణులు, అధికారులు ఇప్పటికే విద్యాశాఖకు సూచించారు.     

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
</