శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 08, 2020 , 21:21:41

కర్ణాటక మాజీ గవర్నర్‌ మృతి..

కర్ణాటక మాజీ గవర్నర్‌ మృతి..

హైదరాబాద్‌: కర్ణాటక మాజీ గవర్నర్‌, కేంద్ర మాజీ న్యాయ శాఖ మంత్రి హన్స్‌రాజ్‌ భరద్వాజ్‌(82) గుండెపోటుతో మృతి చెందారు. గత కొద్ది కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2009 నుంచి 2014 వరకు ఆయన కర్ణాటక గవర్నర్‌గా సేవలందించారు. జనవరి 2012 నుంచి మార్చి 2013 వరకు కేరళ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. కాగా, ఆయన రాజకీయ ప్రస్థానం 1982లో ప్రారంభమైంది. ఇందిరాగాంధీ ప్రోద్భలంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్‌ నుంచి 5 సార్లు రాజ్యసభకు ఎన్నికైన ఆయన.. రాజీవ్‌గాంధీ, పీ.వి.నరసింహారావు హయాంలో 9 ఏళ్ల పాటు లా మినిస్టర్‌గా విధులు నిర్వర్తించారు. 2009లో యూపీఏ అధికారంలోకి వచ్చాక, వీరప్ప మొయిలీకి న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించిన యూపీఏ అధిష్టానం.. హన్స్‌రాజ్‌ భరద్వాజ్‌ను కర్ణాటక గవర్నర్‌గా నియమించింది. 


logo