బుధవారం 08 జూలై 2020
National - Jun 29, 2020 , 17:03:06

ఇంధ‌న ధ‌ర పెరిగింద‌ని సైకిల్ తొక్కిన మాజీ సీఎం

ఇంధ‌న ధ‌ర పెరిగింద‌ని సైకిల్ తొక్కిన మాజీ సీఎం

బెంగ‌ళూరు: దేశంలో ఇంధ‌న ధ‌ర‌లు వ‌రుస‌గా పెరుగుతుండ‌టాన్ని నిర‌సిస్తూ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షమైన‌ కాంగ్రెస్ పార్టీ దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు చేప‌ట్టింది. క‌ర్ణాట‌క‌లో ఆ రాష్ట్ర‌ మాజీ ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య‌, మ‌రో సీనియ‌ర్‌ నేత డీకే శివ‌కుమార్ ఆధ్వ‌ర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆందోళ‌న‌కు దిగింది. సిద్ధ‌రామ‌య్య‌, శివ కుమార్ ఇద్ద‌రూ త‌మ‌త‌మ నివాసాల నుంచి సైకిల్ తొక్కుతూ ఆందోళ‌న జ‌రిగే ప్ర‌దేశానికి చేరుకున్నారు. అనంత‌రం ఓ బైకుకు పాడె క‌ట్టి అంతిమ‌యాత్ర నిర్వ‌హించారు. 

ఈ సంద‌ర్భంగా సిద్ధ‌రామ‌య్య‌, శివ‌కుమార్ కేంద్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శలు గుప్పించారు. యూపీఏ హ‌యాంలో ఇంధ‌న ధ‌ర‌లు ఏ మాత్రం పెరిగినా బీజేపీ నాయ‌కులు గ‌గ్గోలు పెట్టేవార‌ని, ఇప్పుడు ఇర‌వై రోజులకుపైగా రోజూ క్ర‌మం త‌ప్ప‌కుండా ఇంధ‌న ధ‌ర‌లు ఎందుకు పెరుగుతున్నాయ‌ని వారు ప్ర‌శ్నించారు. పెరిగిన ఇంధ‌న ధ‌ర‌ల‌ను త‌క్ష‌ణ‌మే త‌గ్గించాల‌ని డిమాండ్ చేశారు. త‌మ ఆందోళ‌న‌ల‌పై స్థానిక డీసీపీ త‌న ఇష్ట‌మొచ్చిన కేసు పెట్టుకోవ‌చ్చ‌ని, త‌మ‌పై ఎన్ని కేసులు న‌మోదు చేసినా బెదిరేది లేద‌ని డీకే శివ‌కుమార్ వ్యాఖ్యానించారు.

    


logo