బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 13, 2020 , 16:40:37

పడకలు ఇవ్వని ప్రైవేట్ దవాఖానల లైసెన్సులు రద్దు చేయండి..

పడకలు ఇవ్వని ప్రైవేట్ దవాఖానల లైసెన్సులు రద్దు చేయండి..

బెంగళూరు: కరోనా నిబంధనలు పాటించని ప్రైవేట్ దవాఖానలు, ప్రైవేటు మెడికల్ కాలేజీల లైసెన్సులను సీఎం యెడియూరప్ప రద్దు చేయాలని కర్ణాటక డిప్యూటీ సీఎం డాక్టర్ సీఎన్ అశ్వత్ నారాయణ్ కోరారు. కరోనా నిబంధనల ప్రకారం ప్రైవేట్ దవాఖానలు, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 50 శాతం పడకలను ప్రభుత్వానికి కేటాయించాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఇలా చేయని దవాఖానలు, వైద్య కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. కర్ణాటకలో ఇప్పటి వరకు 39 వేలకుపైగా కరోనా కేసులు నమోదు కాగా 684 మంది మరణించారు.logo